ధరణి లలో దరఖాస్తులు చేసుకున్నా వారందరికీ రైతు బీమా ఇవ్వాలి.
*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్.
చిట్యాల4(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాద బైనామ, ధరణి లలో భూములు, పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికీ రైతు బీమా పథకం ఇవ్వాలని లేదా పట్టాలు కాని వారికి పట్టాలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సాద బైనామ లో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా భూములు పట్టాలు చేస్తామని చెప్పి కొందరికి పట్టాలు చేసి మిగతా వారికి అన్యాయం ఛేయడం బాదకర మన్నారు. తర్వాత ధరణి లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆర్థికంగా లేని పేదల భూములు పట్టాలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ల, వేల ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు రైతు బీమా పథకం వల్ల బాగుపడుతున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాద బైనామ, ధరణి లలో దరఖాస్తులు చేసుకున్నా వారందరికీ రైతు బీమా ఇవ్వాలి లేదా భూములు పట్టాలు చేయాలని దరఖాస్తులు చేసుకున్నా వారిలో ఆర్థికంగా లేని పేద ప్రజలు దళితుల భూములు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, మండల అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్, నాయకులు సరిగొమ్ముల రాజేందర్ ,గుర్రం తిరుపతి, గురుకుంట్ల కిరణ్, గుర్రం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
Attachments area