ధరణి వెబ్‌సైట్‌తో ఇక పక్కాగా రికార్డులు
హరితహారం కోసం ఏర్పాట్లు
నిజామాబాద్,జూన్26(జనం సాక్షి): వ్యవసాయ భూములకు సంబంధించి పూర్తి వివరాలను ధరణి వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచే కార్యక్రమం వల్ల భూముల తగాదాలకు తావు లేకుండా పోయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో పట్టాపాస్ పుస్తకాల ఖాతా నంబర్లు ఎక్కువగా రైతుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలిందని ఆమె తెలిపారు. జిల్లాలో రైతు సమగ్ర సర్వే అనంతరం రైతులకు త్వరలో ఈ – పాస్‌బుక్‌లు అందజేసామని తెలిపారు. జిల్లాలో రైతు సమగ్ర సర్వే పూర్తి కాగా ఈ సర్వే అనంతరం ప్రతీ రైతుకు ఒకే ఖాతా నంబర్‌తో పట్టా పాస్‌బుక్‌లు అందచేయడం జరిగిందని వివరించారు.వ్యవసాయశాఖ రెవెన్యూ శాఖ సంయుక్తంగా రైతుల వివరాలు నమోదు చేసి అందులో ఉన్న పొరపాట్లను సరిచేయనున్నట్లు తెలిపారు. ఒకే రైతుకు ఒకటికి మించి ఖాతానంబర్లు ఉన్నాయని దీన్ని సరిచేసి ఒకే రైతుకు ఒకే ఖాతా నంబర్ ఇచ్చి వారికి ఉన్న భూమి వివరాలను పొందుపరిచి పట్టాపాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు వివరించారు. ఈ ఖాతా నంబర్ల ఆధారంగానే ప్రభుత్వం అందజేసే రెండు పంటలకు రూ.8000 ఆర్థిక సహాయానికి ఆ రైతు అర్హుడవుతాడన్నారు. అసైన్‌మెంట్, ఫారెస్ట్ భూములు ఎవరైనా పట్టా చేయించుకుంటే చర్యలు చేపట్టి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. రెవెన్యూ రికార్డులలో ఏవైనా లోపాలు ఉంటే రైతులు ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చి సరి చేయించుకోవాలని సూచించారు. ఇదిలావుంటే జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులకు దాదాపు బకాయిలు చెల్లించినట్లు జేసీ తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు రావాల్సి ఉంటే వాటిని త్వరలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కుల నాటుతామని అన్నారు. వాటిని గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు ఏఈవోలు రైతు సర్వే నంబరు ప్రకారం జాబితా తయారు చేసుకోవాలన్నారు. మొక్కలు పంపిణీకి రిజిష్టర్లు నిర్వహించాలని సూచించారు. రైతు పేరు, సర్వే నంబరు, ఆధార్ నంబర్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని అన్నారు. టేకు మొక్కలు పెంచడంతో రైతులకు వచ్చే లాభాలను వివరించాలన్నారు. టేకు మొక్కలు సంవత్సరంలో ఆరు ఫీట్లు ఎత్తు పెరుగు తుందని, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెంచితే లక్ష రూపాయల ఆదాయం ఉంటుందని అన్నారు. టేకు చెట్లతో పంటలకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ఈదురు గాలులకు పంట నష్టపో కుండా టేకు చెట్లు కాపాడతాయన్నారు. రెండు విూటర్ల దూరంలో ఉండే విధంగా ఎ/-లాంటేషన్ చేయాలని, రైతులకు పంచిన వాటిని ప్లాంటేషన్ చేసే విధంగా చూడాలన్నారు. టేకు చెట్లు పెరిగిన తర్వాత అ మ్మడానికి అటవీశాఖ వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అమ్ముకోవచ్చని వివరించారు. మొక్కలు ఎక్కువ పెంచితే రైతుకు ఈజీఎస్ నుంచి లేబర్‌ను ఇస్తామని వారికి కూలీ రైతు ఇవ్వాలని అన్నారు.