ధరణి సమస్యలపై బిజెపి పోరాటం
రాజంపేట్ జనంసాక్షి అక్టోబర్ 21
రాజంపేట్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ జానకి కి ధరణి సమస్యల పైన వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ ధరణి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు వేలాది మంది భూములు రికార్డులో లేకుండా పోయాయని ధరణి ఆన్లైన్ లో మిగులు భూమి అని చూపించటం, కబ్జాలో ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్కు ఇవ్వకపోవడం,పాసుబుక్కుల్లో తప్పులు ఉండడం పూర్తిస్థాయిలో భూమి పాసుబుక్కుల్లోకి నమోదు కాకపోవడం, ఇలాంటి సమస్యల పైన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రమణారెడ్డి గత నెలలో నిరాహార దీక్ష సైతం చేపట్టడం జరిగింది కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మండల కేంద్రాల్లో సమస్యలు ఉన్నటువంటి రైతులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షులు దేవి రెడ్డి గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులు సంపత్ రెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్య రాజంపేట్ టౌన్ అధ్యక్షులు గుర్రాల రాము రైతు నాయకులు సుధాకర్ శ్యామ్ రావు నాయకులు పందుల స్వామి పిట్ల నవీన్ రాజు బాలరాజు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు