ధరణి సమస్యల అధ్యయనం పరిష్కారం పై సమీక్ష .
ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారు.
– ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తాం.
– కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూసమస్యలు పెండింగ్ లో పడ్డాయి.
– పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయి.
– ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయి.
– రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకార్లను ఆశ్రయించవద్దు. డబ్బులు ఇవ్వొద్దు.
రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు
సిద్దిపేట బ్యూరో 14,జూన్ ( జనం సాక్షి )
ధరణి పోర్టల్‌పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఏలా పరిష్కారం చేయాలనే అంశాలపై సమాలోచనలతో చర్చించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో ధరణి పోర్టల్‌పై సంబంధిత అధికారులతో మంత్రి, సీఎస్ సమీక్షించారు.జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలన్నారు.ధరణి సమస్యల అధ్యయనంకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చించి, వాటిలో టెక్నీకల్ గా ఎదుర్కొంటున్న అంశాలపై కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో 186, అలాగే ములుగు మండలంలో 46 ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు.
ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘ చర్చ జరిగింది.ధరణి పోర్టల్ రోజువారీ కార్యకలపాల్లో తలెత్తుతున్న ఇబ్బందులైన పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు నమోదు కావడం, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత వివరాల్లో తేడాలు ప్రధాన సమస్యలు, పరిష్కారం పై మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే.ఈ మేరకు ధరణి పోర్టల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేస్తున్నది. రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కారాలపై కసరత్తు చేసి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ ప్రవేశ పెట్టాలనే యోచనపై సమీక్షలో సమాలోచనలతో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే అంశాలపై చర్చించారు.
సిద్ధిపేట జిల్లా ములుగు రైతు వేదికలో ధరణి అవగాహన సదస్సు. రైతులతో ధరణి సమస్యల పై అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.
– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కామెంట్స్
– రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ధరణి అనే విప్లవాత్మకమైన మార్పు తేవడంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగాయి.గతంలో ఎల్ఆర్ యూపీ ద్వారా కొన్ని భూ సమస్యలు మిగిలిపోయాయి. ఆ సమస్యల్ని మీ దగ్గరికి వచ్చి అర్థం చేసుకుని, ఒక్క భూ సమస్య లేకుండా పరిష్కార దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ములుగులో ధరణి పై అవగాహన సదస్సు చేపట్టాం.ధరణి అనేది ఒక అద్భుతం. ధరణి అనేది ఒక విప్లవాత్మకమైన చర్య. ఆ ధరణిలో నెలకొన్న భూ సమస్యలు ఏమిటి.? అంటే ధరణికి ముందు గత అధికారులు ఎల్ఆర్ యూపీలో కొన్ని భూ సమస్యలు ధరణిలో ఎక్కనందున, ఎదురైన అవాంతరాలు.తప్పుగా ఎక్కడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అలా ఎదురైనా భూ సమస్యలకు పరిష్కారం చూపేలా.. ఎలాంటి భూ సమస్య లేకుండా చూపాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.ధరణిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.రైతుల భూసమస్య ల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకు వచ్చారు. ఇది అతి పెద్ద కార్యక్రమం. కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి.రైతులు భూములు విషయం లో తరరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి ద్వారా పరిష్కారమయ్యాయి.కోర్టు కేసులు కాకుండా,వ్యక్ట్గి గత సమస్యలు లేకుండా ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం.
– పైలెట్ ప్రాజెక్టుగా ములుగు మండలంలో వంద శాతం సమస్యలు పరిష్కరించి రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.
– ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో చేపడతాం.
టైం బౌండ్ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని వంద శాతం అన్నీ గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారిస్తాం. ఎవరూ అసలు ఆందోళన చెందొద్దు.రైతుల భూములకు వందేళ్ల వరకు కూడా పూర్తి భద్రత ఉంటుంది. ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్ పడింది. భూమిపై పూర్తి హక్కు కల్పించబడింది.ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారు.నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని., భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యం.ధరణి పోర్టల్ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చామని, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలట్ గా ప్రారంభించాం.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం.
ఈ సమీక్షలో రాష్ట్ర ఉన్నతాధికారులు సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీఎస్ టీఎస్ టెక్నీకల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగం తదితరులు ఉన్నారు.