ధర్మపురి మండలం పద్మశాలి అధ్యక్షుడు గా: మచ్చ సత్యం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పద్మశాలి అధ్యక్షుడిగా ఆదివారం రోజున ఎన్నుకోబడిన రాజారం గ్రామానికి చెందిన మచ్చ సత్యం అధ్యక్షునిగా ఎన్నుకోగా మంగళవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్,ను
నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచుం అందించారు, అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, గ్రామాల వారిగా సంఘాలుగా ఏర్పడి గ్రామ కమిటీలు వేయాలని ఆయన సూచిస్తూ, గ్రామాల నుండి ఎటువంటి సమస్యలు ఉన్న అధ్యక్షుల దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోగ రమేష్, రామయ్యపల్లే,జుంజురి అశోక్, నేరెళ్ళ ఆడెపు బాపన్న,తిమ్మాపూర్ ప్రధాన కార్యదర్శి కటుకం నరేందర్,సంయుక్త కార్యదర్శి కురిక్యాల రాజేశం,జైన కోశాధికారి అయ్యోరి సత్యం,జైన మరియు ముఖ్య సలహా దారుడు కటకం శంకర్,దమ్మన్నపెట్ కార్యవర్గ సభ్యులు మరియు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.