ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక వాయిదా
హైదరాబాద్: ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పణ వాయిదా పడింది. శనివారం సాయంత్రం ప్రాథమిక ఆంశాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీ తొలుత నిర్ణయించింది. కానీ నిన్నటీ సమావేశంలో ఉన్న మంత్రులందరూ దీనికి హాజరు కాలేదు. మరోపక్క పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలు సేకరించి సీఎం, పీసీసీ చీఫ్‌లకు ఒకే రోజు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 25న గాంధీభవన్‌లో కిరణ్, బొత్సలకు ప్రాథమిక నివేదిక అందించనుంది.