ధర్మాన వ్యవహారంపై తీర్మానం చేయడం దురదృష్టకరం: డీఎల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహరంపై మంత్రి వర్గంలో తీర్మానం చేయడం దురదృష్ణకరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం నేరుగా పరిశీలిస్తుందని తెలిపారు. మంత్రి వర్గంలో ఉన్నాం కాబట్టి ఈ రకంగా స్పందిచాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తాను ప్రశ్నించినట్టే న్యాయపరమైన అంశాలను ఈవ్యవహారంలో గవర్నర్ లేవనెత్తారని తెలిపారు. ధర్మాన ఉదంతంతోనైనా సీఎం తన వైఖరి మార్చుకోవాలని కోరారు. అన్ని అంశాలపై నా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవడం తగదని ఈ వ్యవహారం రుజువు చేసిందని చెప్పారు.