ధర్మారంలోసర్పంచ్ ..కార్యదర్శి..
ఏళ్లు గడిచిన మురికి కాలువ నిర్మాణం శూన్యం..
ఇబ్బందుల్లో కాలనీవాసులు…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23..
శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో మరమత్తులను గ్రామ సర్పంచ్ ,పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ధర్మారం లో గ్రామ సర్పంచ్ చుక్కల రవి, పంచాయతీ కార్యదర్శి జీవిత ఎస్సీ కాలనీ వాసులపై కక్షపూరితంగా వ్యవహరిస్తు, ఎస్సీ కాలనీలో స్వయంగా సర్పంచ్ చుక్కల రవి, ధ్వంసము చేసిన నేతికి నిర్మాణం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మారం గ్రామమ ప్రభుత్వము ఎస్సీ రిజర్వుడ్ చేసి ,ఎస్సీ గ్రామ సర్పంచిగా ఎన్నికలు నిర్వహించగా, గ్రామ సర్పంచిగా గెలిచిన దళిత వర్గానికి చెందిన దేవునూరి ఇసాక్ కాలనీ పై ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి పనులను కాలనీలో నిర్వహించారని, ఇసాక్ అకాల మరణం చెందడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడంలేదని, గ్రామ సర్పంచిగా సర్పంచ్ ఇసాక్ మృతి చెందిన, అనంతరం సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఉపసర్పంచ్ చుక్కల రవి, సర్పంచిగా ఏళ్ల తరబడి, ప్రభుత్వ నిధులను డ్రా చేస్తు, తన ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తూ దళిత కాలనీకి ఒక్క రూపాయి పెట్టకుండ, అభివృద్ధి చేయడమే కాకుండ, దళిత కాలంలో ఉన్న మురుగునీటి కాలువను ధ్వంసం చేసి, ఏళ్ళు గడిచిన నిర్మాణం చెయ్యకపోవడంతో, ఇటీవల వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నీరు నిలువగా కావడంతో కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దళిత కాలనీ సందర్శించి ఎస్సీ రిజర్వుడు స్థానంలో సర్పంచ్ గా కొనసాగుతున్న బీసీ వ్యక్తి చుక్కల రవి, పంచాయతీ కార్యదర్శి జీవిత పై శాఖ పరంగా చర్యలు తీసుకొని ఎస్సీ కాలనీ వాసులకు, గ్రామస్తులకు తగిన న్యాయం చేయాలని, గ్రామ ప్రజలు ,కాలనీవాసులు కోరుచున్నారు.