ధాన్యం ఆరబెట్టుకుని తీసుకుని రావాలి
మంచిర్యాల,నవంబర్27(జనంసాక్షి) : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, అప్పుడు కొనుగోళ్లలో ఇబ్బందులు రావని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకలేశ్వర్లు అన్నారు. రైతులు తీసుకు వచ్చిన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధరకు విక్రయించే విధంగా తోడ్పాటు అందించాలన్నారు. కేంద్రాలలో 20 టర్పాలిన్‌లు, ఒకట్యాబ్, ప్రింటర్, వేయింగ్‌స్కేలు, తప్పని సరిగా ఉండాలన్నారు. రైతులకు నీడ, మంచినీరు, సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నాణ్య మైన వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.