ధాన్యం కొనుగోళ్లపై కావాలనే రాజకీయం
చివరి గింజవరకు కేంద్రం కొనుగోళ్లకు సిద్దం
టిఆర్‌ఎస్ బెదిరింపులకు భయపడేది లేదన్న కిషన్ రెడ్డి
న్యూఢల్లీి,డిసెంబర్7 (జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రచారం కోసమే టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురాబాద్ లో ఓటమి తర్వాతే ప్లాన్ ప్రకారం టీఆర్‌ఎస్ ఆందోళనలు చేస్తుందన్నారు. తాము టీఆర్‌ఎస్ కో ,కేసీఆర్ కో భయపడబోమన్నారు. బాయిల్డ్ రైస్ ఒప్పందంపై సంతకం చేసింది కేసీఆరేనన్నారు. మెడ విూద కత్తిపెట్టారనేది దురదృష్టకరమన్నారు. మెడవిూద కత్తిపెట్టి బెదిరిస్తే.. సంతకం చేయడానికి.. టీఆర్‌ఎస్ అంత మెతక ప్రభుత్వామా? అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ ఒప్పందంపై సంతకం చేసి ఇపుడు సమస్య అంటున్నారన్నారు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారన్నారు. ధర్నాలు చేయడం ఆపి..ధాన్యం కొనాలన్నారు. ధాన్యం చివరి గింజవరకు కొంటామని అన్నారు. ప్రస్తుత ధాన్యం కొనుగోల్లు చేయకుండా రాజకీయం చేª`తూ వచ్చే యాసంగి ధాన్యం గురించి మాట్లాడడం ద్వారా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. వెంటనే ధన్యాం కొనుగోళ్లు చేయాలన్నారు. ధాన్యం కొనకుంటే చౌకబియ్యం, హాస్టళ్లకు ఎక్కడి నుంచి సరఫరా చేస్తారని ప్రశ్నించారు. యాసంగి ధాన్యంపై ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కెసిఆర్ కావాలనే రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు.