ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం

yuvaraj singh father yograj singh fire on dhoni

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం వెళ్ళగక్కాడు. నా కొడుకుతో నీకేం ఇబ్బందని యోగ్‌రాజ్ సింగ్ ధోనీపై ఫైర్ అయ్యాడు. వరల్డ్‌కప్‌కు యువీని ఎంపిక చేయకపోవడం తప్పన్నారు. యువీతో ధోనీకి ఏం ఇబ్బందని, దానికి గల కారణాలు తెలియజెప్పాలన్నారు. తన కుమారుడు కేన్సర్‌తో బాధ పడుతూ కూడా దేశం కొరకు ఆడాడన్నారు. అప్పట్లో యువరాజ్ వంటి దిగ్గజ ఆటగాడిని పక్కకు పెట్టి స్టూవర్ట్ బిన్నీ లాంటి ఆటగాళ్ళని ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఐపీఎల్-8 వేలంలో యువరాజ్ సింగ్‌ను 16 కోట్లకు డిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకోవడం గమనార్హం.