నంద్యాలలో విలేకరి దారుణ హత్య
అక్రమాలపై వార్తలు రాసినందుకు కానిస్టేబుల్ కక్ష
తమ్ముడితో కలసి కిరాతకంగా చెన్నకేశ హత్య
తక్షణం నిందితుల అరెస్క్టు డిజిపి సవాంగ్ ఆదేశాలు
కర్నూలు,ఆగస్ట్9(జనంసాక్షి): కర్నూలు జిల్లా నంద్యాలో దారుణం జరిగింది. ఓ జర్నలిస్టును కానిస్టేబుల్, అతని సోదరుడితో కలసి దారుణంగా హత్య చేశాడు. అక్రమాలకు అడ్డుగా ఉన్నాడన్న కక్షతో ఈ హత్యకు పాల్పడ్డాడు. ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తోణ విచారణకు డిజిపి గౌతం సవాంగ్ ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళితే ..తన అరాచకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో… వి5 ఛానల్ జర్నలిస్టు చెన్నకేశవను ఓ కానిస్టేబుల్ హత్య చేసాడు. నంద్యాల టూటౌన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యకు గుట్కా వ్యాపారాలతో సంబంధాలున్నాయి. పేకాట ఆడుతూ చాలాసార్లు పట్టుబడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని విధుల నుండి సస్పెండ్ చేశారు. తన సస్పెండ్‌కు వి 5 ఛానల్ రిపోర్టర్ చెన్నకేశవ కారణమని భావించిన కానిస్టేబుల్ అతనికి ఫోన్ చేసి.. మాట్లాడాలని పిలిచాడు. కానిస్టేబుల్, అతని తమ్ముడు నాని ఇద్దరూ కలిసి జర్నలిస్టును స్కూడ్ర్రైవర్‌తో పొడిచి హత్య చేశారు. వారి చేతుల్లో నుండి జర్నలిస్టు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ మళ్లీ పట్టుకొని పొడిచి చంపారు. నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌పి సుధీర్ రెడ్డి పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు