నకిలీ పాసు పుస్తకాల తయారీలో ఉపతహసీల్దార్

కరీంనగర్: జిల్లాలోని భీమదేవర పల్లిలో నకిలీ పాసుపుస్తకాల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రెండు నకిలీ పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల్లో ఉప తహసీల్దార్ రాజమౌళి, రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాములు, వీఆర్వో నరోత్తమ్ రెడ్డి ఉన్నారని పోలీసులు తెలిపారు.