నగదు బదిలీకి సిద్ధం పది లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

‘మీ డబ్బు మీ చేతులో’ : జైరాం రమేశ్‌

నగదు బదిలీ పథకం అమలు చేయడానికి కేంద్ర సర్కార్‌ నిర్ణయించింది. ఇంతకాలం దీనిపై కసరత్తు చేస్తున్న కేంద్రంఇక పథకాన్ని అమలు చేసేం దుకు ధృడసంకల్పంతో ముందుకు వచ్చింది. పలు పథకాల కింద సబ్సిడీలు ఎత్తేసి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును మల్లించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. దీంతో అనర్హులకు సబ్సి డీలు అందబోవని భావిస్తున్నారు. కేవలం నిరు పేదలకు మాత్రమే సబ్సిడీ మొత్తాన్ని నగదుగా అందిస్తారు. అయఇతే ఈపథకం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ అని విపక్షా లు విమర్శిస్తున్నాయి. వచ్చే జనవరి ఒకటినుంచి అమలు చేయ తలపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరు తుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపా రు. నగదు బదిలీ వల్ల నకిలీ లబ్దిదారులను ఏరివేస్తా మని, నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ పద్దతిలో అనర్హులకు రాయితీలను తొలగించవచ్చన్నారు. ఆధార్‌ కార్డుల ద్వారా నగదు బదిలీ పథకం లబ్దిదారులను గుర్తిస్తామన్నారు. 2013 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం విస్తరిం చనున్నట్లు చిదంబరం తెలిపారు. వచ్చే సంవత్స రం జనవరి 1 నుంచి ‘నగదు బదిలీ పథకం’ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆధార్‌కార్డు ద్వారా నగదు బదిలీ పథకం లబ్దిదారులను ఎంపికచేస్తామని స్పష్టం చేశారు. మొదట ప్రయోగాత్మకంగా జార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, త్రిపుర, మధ్యప్రదేశ్‌ రాష్టాల్రలోని 51 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు- తెలిపారు. ఈ పథకం వల్ల సుమారు పది లక్షల మందికి లాభం చేకూరుతుందని వివరించారు. 2013 డిసెంబర్‌ నాటికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 42 పథకాలను ఈ నగదు బదిలీ పథకంలో అంతర్బాగమేని చెప్పారు.నగదు బదిలీ పథకం ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరగుతుందని ఆయన వెల్లడించారు. ఈ పథకం నకిలీ లబ్దిదారులను ఏరివేయడానికి, అనర్హులను తొలగించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే రాయితీలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోకి వేస్తామని వివరించారు. కాగా, ‘విూ డబ్బు, విూచేతిలో’ అనేది నగదు బదిలీ పథకం ఉద్దేశ్యం అని మరో కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే సూక్ష్మరుణాలకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌ ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్టాల్రకు మేలు జరుగుతుందన్నారు.