నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ : గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని … గ్యాస్ వినియోగదారులకు నేరుగా రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా పథకాలకు సంబంధించి అస్‌లైస్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు సాధారణంగా సమస్యలు వస్తుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.