నగరంలో పలు చోట్ల భారీ వర్షం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే విధంగా హబ్సిగూడ, ఓయూ, నాచారం, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, తార్నాక, కుత్బుల్లాపూర్‌, సురారం, చింతల్‌, గాజుల రామారం, కొంపల్లి బహూదూర్‌ పల్లి, షాపూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.