నగరంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం

హైదరాబాద్‌: నగరంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హయత్‌నగర్‌ ఇంజాపూర్‌లోని లక్ష్మారెడ్డి పౌల్ట్రీఫామ్‌లో 9 వేల కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయి. మరో లక్ష కోళ్లకు కూడా ఈ వ్యాధి సోకిందని అనుమానిస్తున్నారు. అధికారులు కోళ్లఫారాలను తనిఖీలు చేస్తున్నారు.