నగరంలో సినీనటి కాజల్ సందడి
కరీంనగర్, మార్చి 29: నగరంలో సినీనటి కాజల్ అగర్వాల్ ఆదివారం సందడి చేశారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్‌మాల్‌ని ఆమె ప్రారంభించారు. దీంతో తమ అభిమాన నటిని చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్వల్ప తొక్కిసలాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.