నగ్నఫోటోల రణ్‌వీర్‌పై కేసు నమోదు
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలను కించపరిచినందుకు ఆ కేసును పెట్టారు. ఐపీసీలోని 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67ఏ కింద రణ్‌వీర్‌పై కేసు బుక్ చేశారు. చెంబూరు పోలీసు స్టేషన్‌లో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఓ ఎన్జీవోకు చెందిన ఆఫీసు బేరర్ చెంబూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు అందజేశాడు. పేపర్ మ్యాగ్జిన్ కోసం రణ్‌వీర్ నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు.