నన్ను ఎందుకు బర్తరఫ్‌ చేశారో స్పష్టత రాలేదు:

డీఎల్‌
హైదరాబాద్‌ : తనను ఏ పరిస్థితుల్లో డిస్మిస్‌ చేశారో చెప్పేందుకే సీఎల్పీ కార్యాలయానికి వచ్చినట్లు మాజీ మంత్రి డీఎల్‌ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తి పాలనలో రాజ్యం నడుస్తుందా? అని అనుమానం కలుగుతోందని అన్నారు. తనను ఎందుకు బర్తరఫ్‌ చేశారో స్పష్టత రాలేదు అని పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయని మండిపడ్డారు.