నమ్మితే ఇక అన్నీ బందే: బొడిగెశోభ
జమ్మికుంట,ఆగస్ట్13(జనంసాక్షి): ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్ అంటడు’ అనిబిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఎద్దేవా చేశారు.
హుజూరాబాద్‌లో దెబ్బకొడితే కేసీఆర్‌కు దిమ్మతిరగాలని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిలెక్క తీసిన వ్యక్తి కేసీఆర్ అని, ఈటెల రాజీనామా చేయడం వల్ల పెన్షన్లు, రేషన్‌కార్డులు, గొర్లు, దళిత బంధు వస్తున్నాయని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో దళిత బిడ్డలకు పెడుతున్నం భోజనానికి కూడా పైసలు ఇవ్వకపోవడంతోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ’ నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గంలో పనులు చేయడానికి చేతకాదు కానీ ఇక్కడకు వచ్చి అన్నీ ఇస్తామంటున్నారని మండిపడ్డారు.