నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన బిజెపి నాయకులు.
తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)దేశ ప్రదాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం సేవా వారోత్సవాల్లో సందర్భంగా సోమవారం తాండూరులోనీ వార్డ్ నెంబర్ 23 మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ పాల్గొని వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన ఎన్ని సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి పదం వైపు దూసుకు పోతుందని దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు భారత్ నిలవడం నరేంద్ర మోడీ నిరంతర శ్రమ కృషి వల్లనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి దేశం పట్ల వారికి ఉన్న నిబద్ధతను ప్రపంచ దేశాల దేశాల నాయకులు కొనియాడుతున్నారు ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక దేశంగా ఎదగడం అందరికీ ఆశ్చర్యాని కలిగించిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ సందీప్ కుమార్ నాయకులు పూజారి పాండు మిట్టిశ్రీనివాస్ కందరెల్లి మహేష్ అంతారం కిరణ్ ప్రహల్లాద్ జాదవ్ నీరటీ రవి మడపతి సతీష్ కుమార్ సంజీవ్ చిదిరి ప్రకాష్ చందు పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఉమాదేవి మీడియా ఇంచార్జ్ కొత్తూరు చంద్రశేఖర్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.