నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం.. నకిరేకల్ తరలింపు…

ubal39u5

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయం నుంచి నకిరేకల్ కు తరలిస్తున్నారు. అంతిమయాత్రలో సీపీఎం పొలిట్ బ్యూరో బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. తమ్మినేని వీరభద్రంలు పాల్గొన్నారు. వాహనం ముందు భాగాన రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తున్నారు. ద్విచక్ర, ఫోర్ వీలర్స్ తో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రియతమ నేత నర్రా రాఘవరెడ్డిని కడసారి చూసేందుకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్ టిర్ కూడా నర్రా రాఘవరెడ్డికి అమితమైన గౌరవం ఇచ్చేవారని నేతలు గుర్తు చేస్తున్నారు. జిల్లా ప్రజాతంత్ర ఉద్యమానికి ఆయన దిక్సూచి… ఆయన విజ్ఞాన గని…అని కొనియాడుతున్నారు. నకిరేకల్ పార్టీ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం వట్టిమర్తికి తరలించి.. అక్కడ కొంత సమయం ఉంచి.. అనంతరం నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.