నర్సరీ చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి
చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి అన్నారు. గురువారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతకు జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ వారి సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో నర్సరీ రియరింగ్ చెరువుల నిర్వహణలో తీసుకోవాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు . చెరువులను బాగా ఎండ నిచ్చి దున్ని శత్రు చేపలను నివారించడం కలుపు చేపలను నిర్మూలించడం నీటి కలుపు మొక్కలు నీటి పురుగులను నిర్మూలించడం చేపట్టిన తర్వాత సున్నం చల్లి రసాయనిక సేంద్రీయ ఎరువులు వాడి ప్లవకాలను అభివృద్ధి చేసిన పిదప స్పాన్ ను చెరువుల్లో వదులుకోవాలని సూచించారు. తద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునని అన్నారు. శిక్షణలో భాగంగా చెరువులలో సేంద్రీయ రసాయన జీవ ఎరువులను వాడి సత్తువ చేసుకొనే విధానాల గురించి కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమార్ వివరించారు.ఈ శిక్షణలో ఉషారాణి, గోపమ్మ, మమత, నిర్మల, కావేరి,ప్రమీల, ఉష, మారతమ్మ, సురేష్ ,వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం,రవికుమార్, నాగరాజు, సాగర్, రాజేష్, శ్రవణ్, గిరి తో పాటు 30 మంది పాల్గొన్నారు.