నర్సాపూర్ రక్తమోడింది..

1మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తాలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.