నల్గొండలో సీపీఐ కార్యకర్త దారుణ హత్య

నల్లగొండ: సీపీఐ కార్యకర్త యాదయ్య ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాదయ్యను గొడ్డలితో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.