నల్గొండ జిల్లా ఆలేరులో భారీ ఎన్‌కౌంటర్‌

drqh9zncఐదుగురు ఉగ్రవాదులు హతం

భువనగిరి, ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు – వరంగల్‌ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారిపై ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. వికారుద్దీన్‌ ముఠాను ఉదయం వరంగల్‌ జిల్లా జైలు నుంచి హైదరాబాద్‌ నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్కార్ట్‌ వాహనం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించగానే గన్‌మెన్‌ వద్ద ఉన్న తుపాకీ లాక్కునేందుకు వికారుద్దీన్‌ ముఠా సభ్యులు ప్రయత్నించి దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో వికారుద్దీన్‌తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో వికారుద్దీన్‌ ముఠాకు 18మంది సిబ్బందితో ఎస్‌-1 కేటగిరీ సెక్యూరిటీ ఉంది.

మృతిచెందిన ఉగ్రవాదులు వీరే

వరంగల్‌ జిల్లా ఆలేరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌, సయ్యద్‌ అంజాద్‌, మహమ్మద్‌ అనీఫ్‌, మహమ్మద్‌ జకీర్‌, ఇజార్‌ఖాన్‌ ఉన్నట్లు గుర్తించారు.

వికారుద్దీన్‌ నేర చరిత్ర…
కరుడగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌కు సుదీర్ఘమైన నేర చరిత్ర ఉంది. 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌ వద్ద పోలీసులపై కాల్పులు జరిపాడు. గతంలో సిమీలో క్రీయాశీలకంగా పనిచేసిన వికారుద్దీన్‌ డీజేఎస్‌ పేరుతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించాడు. గత కొన్నేళ్లుగా జైల్లో ఉన్న వికారుద్దీన్‌ పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.