నల్గొండ పట్టణం లో జరుగుతున్న రహదారుల విస్తరణ. జంక్షన్. పార్కుల అభివృద్ధి వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ పట్టణం లో జరుగుతున్న రహాదారుల, విస్తరణ,అభివృద్ధి,జంక్షన్ ల అభివృద్ధి, సుందరీకరణ,పార్కుల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
శనివారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. పార్కులో పర్యటించి మొక్కలు ఇంకా విరివిగా నాటాలని ఆయన తెలిపారు. ఎలక్ట్రికల్ పోల్స్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఎలక్ట్రికల్ టవర్స్ కు వెంటనే కనెక్షన్లను వెంటనే ఇవ్వాలని, ట్రాన్సుఫార్మర్ ను వెంటనే అమర్చాలని ఆయన ఆదేశించారు.  అక్కడ జరుగుతున్న  క్యాంటీన్ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎంట్రెన్సులో ఆర్చి ఏర్పాటు చేసి చర్లపల్లి అర్చన్ పార్కు అని ఉండే విధంగా నేమ్ ప్లేట్ ను అమర్చాలని ఆయన మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.  అర్బన్ పార్క్ నుండి  పార్కు గేట్ వరకు ఇంటర్ లాక్ సిస్టమ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదే విధంగా పార్కు ఎదురుగా జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి వారం రోజులలో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లకు, ఏజెన్సీ నిర్వాహులకు సూచించారు.  పార్కు  ముందు భాగంలో వాహనాల పార్కింగ్ స్థలంలో  పెద్ద కంకర, చిన్న కంకర మిక్స్ చేసి దుమ్ము లేవకుండా పోయించాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. పార్కు చుట్టూ కౌంపౌండ్ వాల్ పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత ఏజెన్సీ వారిని ఆదేశించారు. మర్రిగూడ బైపాస్ వద్ద జంక్షన్ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.  అక్కడి నుండి డివైడర్ల మధ్యలో పెద్ద మొక్కలతోపాటు చిన్న మొక్కలను నాటే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అదే మొక్కలకు నీటిని అందించాలని సంబంధిత నిర్వహకులకు తెలిపారు. ఎస్.ఎల్.బి.సి. కెనాల్ వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమీషనర్, ఏజెన్సీ వారితో జిల్లా కలెక్టర్  చర్చించారు. అదే విధంగా కెనాల్ కు మరో పక్క ఐ.టి. టవర్ ప్రాంతంలో హ్యండ్ సింబల్ తో కూడిన కట్టడంపై చర్చించారు. అనంతరం పాల కేంద్రం ప్రక్కన ఖాళీగా ఉన్న స్థలంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని సంబంధిత కార్మికులకు తెలియజేశారు. పనులు ఎవ్వరు చేయిస్తున్నారో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలం అయినందున సంబంధిత స్థలంపై విచారణ చేయాల్సిందిగా మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. హైదరాబాద్  రోడ్డు సబ్-స్టేషన్ పరిధిలో వారం రోజుల్లో ఎలక్ట్రిసిటీ పోల్స్ తొలగించి పూర్తి స్థాయిలో డ్రైనేజీ పనులు జరగాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కోరారు. రిలయన్సు ట్రెండ్సు ఎదురుగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేసి వారం  రోజుల్లో రోడ్డుకు అనుసంధానం చేసి వాహనాలను అనుమతించాలని ఆయన ఆదేశించారు. అనంతరం మరోక సైడు డ్రైనేజీ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి మార్బుల్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అదే విధంగా ప్లాస్టింగ్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.  బీట్ మార్కెట్ లోని మార్కెటింగ్ గోదాము, మార్కెటింగ్ శాఖ ఆధీనంలోని భవన నిర్మాణం ధ్వంసం చేస్తున్న పనులను పరశీలించారు.  అదే విధంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు వెనుక నిరుపయోగంగా ఉన్న గోదామును కూడా ధ్వంసం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.  రాజీవ్ పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు.  రాజీవ్ పార్కు గేట్లకు మధ్యలో ఉన్న కట్టడాన్ని తొలగించి  రెండు గేట్లను విస్తరించాలని ఆయన తెలిపారు. గేట్ వద్ద  రాజీవ్ పార్కు అని ఉండే విధంగా అర్చు తయారు చేయించాలని తెలిపారు. అదే విధంగా ఫారెస్టు డిపార్టుమెంట్ పరిధి వరకు కౌంపౌండ్ వాల్ నిర్మించాలని తెలిపారు. పార్కు గోడలకు వేసిన పేయింట్స్ బాగున్నాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఫ్రంట్ లో ఉన్న గోడలకు కూడా పేయింట్స్ వేయించాలని ఆయన తెలిపారు. పార్కు మధ్యులో ఏర్పాటు చేసిన విగ్రహాం వద్ద లైట్స్, వాటర్ ను మానిటరింగ్ చేయడానికి ఎలక్ష్రికల్ టైమర్ ను అమర్చాలని ఆయన తెలిపారు.  పార్కులో కొంత స్థలాన్ని బటర్ ప్లై జోన్గా, కొంత స్థలంలో  యోగా సెంటర్ లేదా మెడిటేషన్ సెంటర్ కొరకు కేటాయించాలని ఆయన తెలిపారు. పార్కులో సీటింగ్ బెంచీలపై స్వయంగా కూర్చుని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూర్చోవడానికి అనువుగా లేనందున పార్కు మిగతా స్థలంలో ఏర్పాటు చేసే బెంచీలు వేరేవి అమర్చాలని తెలిపారు. క్లాక్ టవర్ సెంటర్ లో జరుగుతున్న పనులను పరిశీలించి ముఖ్యంగా క్లాక్ టవర్ అమర్చే గడియారం ఏదేని సందర్భంలో  చెడిపోయినప్పుడు రిపేరు చేసే విధంగా ఉండాలని, లేనిచో చెడిపోయినది మార్చి కొత్త ది అమర్చే విధంగా ఉండాలని సంబంధిత ఏజెన్సీ వారికి సూచించారు. గడియారం స్తూపం చుట్టూ ఏటువంటి డిజైన్ వస్తుంది అని అడిగి తెలుసుకున్నారు.  మధ్యలో నేషనల్ ఫ్లాగ్, హై మాస్ లైట్స్ ఏర్పాటు గురించి మున్సిపల్ కమీషనర్ తో చర్చించారు.  మైసయ్య సర్కిల్ లో అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అన్నపూర్ణ క్యాంటిన్ లోపల గల ప్లాన్ గురించి స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆ ప్రాంతంలో భోజనం చేయడానికి వీలుగా  గొడుగులు ఏర్పాటు చేసి చుట్టూ భోజనం చేసే విధంగా ప్లాన్  చేయాలని మున్సిపల్ కమీషనర్, ఏజేన్సీ వారికి సూచించారు. అదే విధంగా  ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలతో కూడిన ఒక పౌంటేన్ లాంటిది ప్లాన్ చేయాలని ఆయన అధికారులను కోరారు.  అనంతరం దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి దేవరకొండ – సాగర్  రోడ్డు వద్ద జంక్షన్ ఏలా ఏర్పాటు చేయాలో అందుకు గల ప్లాన్ ను సిద్దం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.  అనంతరం  రామ్ నగర్ పార్కును సందర్శించి బోటింగ్, పౌంటేన్ పనులు బాగా జరిగాయని తెలిపారు. అదే విధంగా లోటస్ పౌంటేన్ ను కూడా ఆధునీకరించాలని ఆయన సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.  పార్కులో చెడిపోయిన సీటింగ్ బెంచీలను తొలగించి కొత్త వి ఏర్పాటు చేయాలని తెలిపారు. అదే విధంగా లవ్ నల్లగొండ సింబల్ ను పరిశీలించి ఫోటో దిగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో మెట్లను కూడా ఏర్పాటు చేస్తే గ్రూప్ ఫోటో దిగడానికి, మెట్లు అందంగా ఆకర్షనీయంగా ఉంటాయని తెలిపారు. పార్కు మెయిన్ ఎంట్రైన్సులో విద్యుత్ దీపాలతో  పార్కుకు వెలుపల , పార్కు లోపల కాంతి పడేటట్లుగా అమర్చాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా పార్కులో సోలాల్ విద్యుత్ దీపాల అలంకరణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి,పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు,ఈ ఈ సత్య నారాయణ,  కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.

s