నల్లగొండలో దారుణ హత్య

మఠంపల్లి(నల్లగొండ) : నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య రాములు(60) కూతురికి జామ్లతండాకు చెందిన భానోతు సైదులుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

గత కొన్ని రోజులుగా మామా అల్లుళ్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రాములు తన అల్లుడు సైదులు ఇంటి ఎదురుగా నిలబడి.. దూషిస్తూ.. అతని ఇంటిపై రాళ్లు విసిరాడు. దీంతో కోపోద్రిక్తుడైన సైదులు పక్కనే ఉన్న రోకలిబండతో అతని తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.