నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు
హైదరాబాద్ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని కాంగ్రెస్ నకిలీ బదిలీగా మార్చిందని విమర్శించారు. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందని అంచనా అని అన్నారు. రూ. వెయ్యి రూ. 500 నోట్లను రద్దు చేయాలని కోరారు. జైల్లో కూర్చొని సెటిల్‌మెంట్లు చేసే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. అవినీతి రహిత భారత్ ఏర్పడే వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.