నవదుర్గ దుర్గామాత ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు-

 

అయిదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం

 

ముప్కాల్ మండల కేంద్రంలోని నవదుర్గ దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి…..

ఈరోజు గాయత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు….
పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి పులి వాహనదారియై అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తున్నారు….. ఆలయ అధికార బృందం అమ్మవారికి గాయత్రి దేవికి నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదించారు….. నవదుర్గల్లో మూడవ రోజు అవతారమైన గాయత్రీ దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు…. అమ్మవారి అనుగ్రహంతో పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూతభయాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వసిస్తారు అని అన్నారు

అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కుంకుమార్చన 108 మందితో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాతలు పాల్గొన్నారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ ఆనంద్ గౌడ్, ధర్మపురి, భూలక్ష్మి అసోసియేషన్ మెంబర్స్ ఆలయ కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు