నవేద్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష

2

హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి):

భారత సైన్యానికి పట్టుబడిన పాకిస్థాన్‌ ఉగ్రవాది మహమ్మద్‌ నవేద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇటీవల జరిగిన ఓ దాడి సందర్భంగా నవేద్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే. అతడిని సోమవారం దిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో విచారించారు. విచారణలో నవేద్‌ పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని లై డిటెక్టర్‌ పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఐఏ కోర్టును కోరింది. దీనికి కోర్టు అనుమతించింది. పోలీసుల విచారణలో నవేద్‌ తనకు 20ఏళ్లని, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన వాడినని చెప్పిన సంగతి తెలిసిందే.