నవోదయలో దిగ్విజయంగా ముగిసిన క్లస్టర్ స్థాయి పోటీలు
చొప్పదండి: నవోదయ విద్యాలయంలో సెప్టెంబర్ 6,7వ తేదిలలో నిర్వహించబడిన ఆదిలాబాద్ క్లస్టర్ స్థాయి షటిల్, బ్యాట్మింటన్, వైజ్ఞానిక ప్రదర్శణ పోటీలు 7వ తేది శుక్రవారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా చొప్పదండి సీఐ శ్రీకృష్ణయ్య గౌడ్ గారు విద్యార్థులచే ప్రదర్శంపబడిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనను, షటిల్, బ్యాట్మింటన్ క్రీడలను సంధర్శించి అభినందనలు తెలిపారు. వివిధ విద్యాలయాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఎంఈవో నర్శింగారావు గెలుపొందిన విద్యార్థులకు వారితె వచ్చిన అధ్యాపకులకు సర్టీపికెట్లు, జ్ఞాపికలు అందజేసి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గుర్తుకు తేచ్చే విధంగా నవోదయ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో క్రమశిక్షణగా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ పడాల సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణయ్యలను అభినందించారు. కరీంనగర్, బొప్పదండిలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థిలు నవోదయ విద్యాలయముకు విచ్చేసి వైజ్ఞానిక ప్రదర్శనను అత్యంత ఉత్సహంతె తిలకించారు. విద్యాలయ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఈ ఉత్సవాలను దిగ్విజయంగా ముగియటానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.