నష్టపోయిన సోయా పంట కు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని కేడిఎస్ మరియు ఈగల్ విత్తనాల కంపెనీ పై తగు చర్యలు తీసుకోవాలని భైంసా పట్టణ బీజేపీ కమిటీ తరఫున అగ్రికల్చర్ అధికారికి వినతి

నష్టపోయిన సోయా పంట కు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని కేడిఎస్ మరియు ఈగల్ విత్తనాల కంపెనీ పై తగు చర్యలు తీసుకోవాలని భైంసా పట్టణ బీజేపీ కమిటీ తరఫున అగ్రికల్చర్ అధికారికి వినతి

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 29

నిర్మల్ జిల్లాభైంసా పట్టణ కమిటీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే వర్షాకాలంలో విత్తినటువంటి సోయా పంటకి ఈమధ్య ఆకు పచ్చబడడం మరియు కాండమ్ తెగులు రావడం , కాయ తప్పగ మారడం జరుగుతుందో దాన్ని నివారించడానికి పరిశోధనలు చేయమని మరియు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించగలరని కే డి ఎస్ మరియు ఈగల్ కంపెనీ విత్తనాల వలన ఈ వైరస్ సోకుతున్నందుకు ఆ కంపెనీ పైన తగు చర్యలు తీసుకోగలరని మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి పట్టణ అధ్యక్షులు యేనుపోతుల మల్లేశ్వర్ కౌన్సిలర్ రావుల సువర్ణ పోశెట్టి ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొర్వ చిన్నాన్న పట్టణ ఉపాధ్యక్షులు రఘువీర్ నందు భయ్యా పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ ఉపాధ్యక్షులు నారాయణ ఎస్టి మోర్చా పట్టణ అధ్యక్షులు సంతోష్ రాథోడ్ మరియు రైతులు తోట లింగారెడ్డి పాల్గొనడం జరిగింది