నాకౌట్‌కు చేరుకున్న రష్యా
ఫిఫా వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన
మాస్కో,జూన్20(జనం సాక్షి ): ఫిఫా వరల్డ్ కప్‌లో ఆతిథ్య దేశం రష్యా అదరగొడుతోంది. సొంత ప్రేక్షకుల నడుమ అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న రష్యా టోర్నీలో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాను 5ా0 తేడాతో చిత్తు చేసిన రష్యా రెండో మ్యాచ్‌లో ఈజిప్టును మట్టికరిపించింది. సెయింట్ పీటర్స్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 3ా1 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌ను ఓడించిన రష్యా నాకౌట్ బెర్తు కన్‌ఫర్మ్ చేసుకుంది. వరుసగా రెండో విజయం సాధించిన రష్యా నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌కు దూరమైన ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ అబ్దుల్ సలా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే దుర్బేధ్యమైన రష్యా డిఫెన్స్ ముందు సలా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. జట్టులో అతనికి సపోర్టింగ్ ఆటగాళ్లు లేకపోవడంతో సలా అంచనాలు నిలబెట్టలేక పోయాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి రష్యా దూకుడుగా ఆడింది. 19వ నిమిషంలోనే రష్యా గోల్ కొట్టే అవకాశం తృటిలో చేజార్చుకుంది. తొలి మ్యాచ్ హీరో చెరిషేవ్ కొట్టిన లాంగ్ కిక్ గోల్ పోస్ట్ పై నుంచి వెళ్లింది. ఇక 42వ నిమిషంలో ఈజిప్ట్ హీరో అబ్దుల్ సలాకు సూపర్ ఛాన్స్ దక్కింది. పెనాల్టీ ఏరియాలో పాస్ అందుకున్న సలా ఈజిప్ట్ ఆటగాళ్లను ఏంతో నేర్పుగా దాటుకుంటూ మెరుపు వేగంతో లెప్ట్ కిక్‌తో గోల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సలా కిక్ గోల్ పోస్ట్ కు కొద్ది దూరం నుంచి వెళ్లింది. ఇరు జట్లు గోల్ కోసం పరస్పరం దాడులు చేయడంతో మ్యాచ్‌రా¬రీగా సాగింది. అయితే ఫస్టాఫ్‌లో స్కోర్ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఇక సెకండాఫ్‌లో ఈజిప్ట్ కెప్టెన్ అబ్దుల్ పాతీ సెల్ఫ్ గోల్‌కు పాల్పడి ఘోరమైన తప్పిదం చేశాడు. చెరిషేవ్ కొట్టిన లో క్రాస్ కిక్‌ను తప్పించే ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ చేశాడు. అబ్దుల్ పాతీ సెల్ఫ్ గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన రష్యా తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఫస్ట్ మ్యాచ్‌లో రెండు గోల్స్ తో చెలరేగిన చెరిషేవ్ మరోసారి అదరగొట్టాడు. 59వ నిమిషంలో సూపర్ గోల్‌తో రష్యా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈ గోల్‌తో టోర్నీలో మొత్తం మూడు గోల్స్ సాధించిన చెరిషేవ్ గో/-డలెన్ బూట్ రేసులో రొనాల్డోకు సమంగా నిలిచాడు. ఇక 62వ నిమిషంలో జుబా మెరుపు గోల్ సాధించడంతో రష్యా 3-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 73వ నిమిషంలో ఈజిప్ట్ కు పెనాల్టీ లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అబ్దుల్ సలా కెరీర్లో తొలి ప్రపంచకప్ గోల్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ రష్యా విజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు.