నాగాలో పాగా వేస్తాం

ప్రజా సమస్యల పరిష్కారం ట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. ఈ విషయంలో తాము ఎన్నోసార్లు నిరూపించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, ప్రజల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామన్నారు. ఆమె 23 నియోజకవర్గాల పరిధిలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించినట్లు నాగాలాండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి మిడోకుల్‌ షాపీ తెలిపారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా ముఖ్య నేతలు ఈనెల 9, 14 తేదీల్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.