నాగావళికి జలకళ
శ్రీకాకుళం, జూన్ 25 : నాగావళి నదిలో నీటి గలగలలు సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నదిలో సుమారు 7,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగావళి నది నీటి ప్రవాహంతో కళకళలాడుతుండడంతో పరీవాహక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.