నాగా తిరుబాటుదారులతో శాంతి ఒప్పందం

5

– ప్రజల కృషి ఎనలేనిది

– ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్‌ ఆగస్టు 3 (జనరసాక్షి ) :

నాగా తిరుగుబాటుదారుల సంస్థ (ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐ.ఎం)తో కేంద్ర ప్రభుత్వం సోమవారం చేసుకున్న ఈ చారిత్రక ఒప్పందంలో నాగా ప్రజల ప్రజల కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఒప్పందానికి బాటలువేసిన ఐజెక్‌ స్యూకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐజెక్‌ స్యూ లేకుంటే ఈ ఒప్పందమే లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. నాగా రాజకీయ అనిశ్చితికి నేటితో తెరవేయడం భారత ప్రజాస్వామ్య పరిణితికి సూచికగా అభివర్ణించారు. నాగా ప్రజల సంస్కృతి, ‘య్రర్య సాహసాలు, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకమన్నారు.

ఈశాన్య భారతంతో బలమైన అనుబంధం

ఈశాన్య భారతంతో తన అనుబంధం ఎంతో బలమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఒప్పందం సందర్భంగా ఆయనకు ఈశాన్య భారతంతో ఉన్న బంధాన్ని నెమరువేసుకున్నారు. నాగా ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించినట్లు చెప్పారు.

కృషిచేసిన అందరికీ వందనాలు

చర్చలను సఫలంచేసి శాంతి ఒప్పందాన్ని వాస్తవరూపం తేవడానికి కృషిచేసిన అందరికీ ప్రధాని మోదీ వందనాలు పలికారు. ఆయుధాలు విడిచి చేయి చేయి కలిపి అభివృద్ధిలో ముందడుగు వేద్దామన్నారు. ఈ శాంతి ఒప్పందానికి సూత్రధారులైన అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. నాగా గ్రూపులన్నింటినీ ఏకం చేసి శాంతి ఒప్పందానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. నాగా ప్రజలంతా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు ఇదో సువర్ణ అవకాశమని మోదీ వ్యాఖ్యానించారు.

ఒప్పందానికి ముందు ప్రతిపక్ష నేతల్ని సంప్రదించిన మోదీ

నాగాలతో ఈ చారిత్రక ఒప్పందం చేసుకొనే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతల్ని సంప్రదించారు. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్‌ యాదవ్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. నాగాలాండ్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రితోనూ మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.