నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య
ఆదిలాబాద్, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యాఘటనపై మొస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తోన్నాడు.