నాగోబా ఆలయ పూజారి దారుణ హత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో దారుణం జరిగింది. నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనపై మెస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేస్తున్నారు.