నాటుసారా కేంద్రాలపై అబ్కారీ అధికారుల దాడి
ధర్మపురి: మండలంలోని బుగ్గారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం నాటుసారా కేంద్రాలపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ సంధర్భంగా 5500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. విక్రయించేందుకు నిల్వ ఉంచిన 50లీటర్ల నాటు సారాను స్వాధీనపరుచుకున్నారు. ధర్మపురి ఇన్‌చార్జి సీఐ కరుణశ్రీ, ఎస్సై పోచయ్య సిబ్బంది పాల్గొన్నారు.