నాటు సారాయి అమ్మిన వ్యక్తికి లక్ష రూ జరిమానాతో, తహసిల్దార్ బెయిల్ మంజూరు జైలు నుండి విడుదల
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 16 ,
జనంసాక్షి
మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని బండాలింగాపూర్ గ్రామానికి చెందిన గోరుమంతుల అశోక్ అనే వ్యక్తి నాటు సారాయి అమ్ముతూ 10 ఫిబ్రవరి 2022 రోజున పట్టుబడుగా , ఒక సంవత్సర కాలం పాటు , మెట్పల్లి తాహసిల్దార్ ముందు, ఒక లక్ష రూపాయల పూచి కత్తుపై బైండోవర్ చేసినాము. కానీ గోరుమంతుల అశోక్ తన ధోరణి మార్చుకోకుండా నాటు సారాయి అమ్ముతో పట్టుపడగా తేది 17 అక్టోబర్ 2022 రోజున కేసు నమోదు చేసి బైండోవర్ నిబంధనలు ఉల్లంగించినందున మెట్పల్లి మండల మెజిస్ట్రేట్ తాహసిల్దార్ నడిమెట్ల సత్యనారాయణ నిందితునికి ఒక లక్ష రూపాయల జరిమానా విధించగా నిర్ణీత గడువులో గా జరిమానకట్టనందున జైలు శిక్ష విధించి జిల్లా కరగారం కరీంనగర్ కు తేదీ 4 నవంబర్ 2022 రోజున జైలుకు తరలించామని అన్నారు. బుధవారం రోజున నిందితుడి భార్య జరిమానా రుసుము లక్ష రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసి తన భర్తకు బెయిలు ఇప్పించగలరని మెట్పల్లి మెజిస్ట్రేట్ తాసిల్దార్ కు ఆర్జి పెట్టుకోగా , తాహసిల్దార్ నిందితునికి బెయిల్ మంజూరు చేశారు. 11 నవంబర్ 2022 రోజున జైలు అధికారులు నిందితుని విడుదల చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాధా మెట్పల్లి పట్టణంలో జరిగిన సమావేశంలో తెలిపారు. నాటు సారాయి తయారీ, రవాణా మరియు అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ సీఐ రాధా హెచ్చరించారు. మెట్పల్లి సర్కిల్ లోని మెట్పల్లి ,మల్లాపూర్ ఇబ్రహీంపట్నం ,కోరుట్ల ,కథలాపూర్ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా నాటు సారాయి అమ్మకాలు జరిపితే పై విధంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి కావున ప్రజలు అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరినారు