నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలి

మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి ):పట్టణ ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ పరిధిలో గొర్రె , మేకల మాంసం అమ్మేవారు విధిగా మున్సిపల్ కబేళా నందు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనుమతులు పొందిన తర్వాతే
మాంస విక్రయాలను చేపట్టాలన్నారు.ఆదివారం పట్టణంలోని జంతు వధుశాల నందు పట్టణ మాంస విక్రయదారులు తీసుకువచ్చిన గొర్రెలు, మేకలను వెటర్నరీ డాక్టర్ పిండిగ జానయ్య , శానిటరీ ఇన్స్పెక్టర్ బండ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా మాంస విక్రయదారులకు పలు సూచనలు చేసి సలహాలిచ్చారు.అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మున్సిపల్ అనుమతి లేకుండా రోడ్లపై , ఇండ్లలో జంతువులను వధించి మాంసం అమ్మితే అట్టి మాంసంపై ఫినాయిల్ చల్లివ్వడంతో పాటు అమ్మిన వారిపై కేసులు నమోదుతో పాటు పెనాల్టీ విధించడం జరుగుతుందని హెచ్చరించారు.