నాతో తలపడండి

3

– మా ఢిల్లీ జనంతో కాదు

– సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ ,జూన్‌ 15(జనంసాక్షి)::ఎప్పుడూ అవకాశం వస్తే కేంద్రం విూద విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అదే రాగంలో సరికొత్త పల్లవి అందుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని, కావాలంటే తనతో దెబ్బలాడాలని.. ఇంకా కావాలంటే తనను కొట్టాలని, అంతేతప్ప ఢిల్లీ ప్రజలను వేధించొద్దని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులు ఆపేందుకు ప్రయత్నించొద్దని ఆయన కోరారు.ఢిల్లీలో పార్లమెంటరీ సెక్రటరీలుగా నియామకమైన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందనే వార్తలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ లపై ఎదురు దాడి ప్రారంభించిన ఆప్‌? మరింత దూకుడు పెంచింది. పార్లమెంటరీ సెక్రటరీల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ లు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఢిల్లీలో పార్లమెంటరీ సెక్రటరీల నియామకం 1953లోనే ప్రారంభమైందన్నారు. 1997లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంటరీ సెక్రటరీల నియామకం జరిగిందని, కాంగ్రెస్‌ హయాంలో షీలా దీక్షిత్‌ కూడా అజయ్‌ మాకెన్‌ ను పార్లమెంటరీ సెక్రటరీగా నియమించారన్నారు. వాళ్లు చేస్తే న్యాయం? ఆప్‌ సర్కారు నియమిస్తే చట్టవిరుద్దమా? అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తనపై ఏదైనా పగ ఉంటే తనను మాత్రమే వేధించాలి తప్ప? ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రధాని మోడీని ఉద్దేశించి కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.కేజ్రీవాల్‌ వాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అసలు కేజ్రీవాల్‌ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విజయేందర్‌ గుప్తా. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్‌ అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ కూడా ఘాటుగా స్పందించింది.తాము నియమించిన పార్లమెంటరీ సెక్రటరీలకు ఎలాంటి అదనపు చెల్లింపులు చేయడం లేదని ఆప్‌ ప్రభుత్వం వాదిస్తోంది. గత ప్రభుత్వాలు పార్లమెంటరీ సెక్రటరీల నియామకాల్లో అనుసరించిన విధానాలను కూడా తెరపైకి తెచ్చింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్‌ లు డిఫెన్స్‌ లో పడ్డాయి. సాహిబ్‌ సింగ్‌ వర్మ దగ్గర నుంచి షీలా దీక్షిత్‌ వరకు అందరూ ఇలాగే చేశారని ఉదాహరణలు కూడా వివరించారు. వాళ్లు చేస్తున్న అదనపు పనులకు వాళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని, అందువల్ల వారి పదవులు ఊడగొట్టించేందుకు ప్రయత్నాలు చేయొద్దని కోరారు. అయితే.. తాను చెప్పదలచుకున్నది చెప్పేసిన తర్వాత.. విూడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేలోపే ముఖ్యమంత్రి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.