నామినేటెడ్ పదవుల్లో అట్టడుగు వర్గాల కు ప్రాధాన్యత కల్పించాలి

బి సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్
మిర్యాలగూడ, జనం సాక్షి.
ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో బీసీ ల్లో ఉన్న అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని బి సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్  విజ్ఞప్తి చేశారు.ఆదివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరిగింది అని అన్నారు.అయితే త్యాగాలు అధిక శాతం  బడుగు బలహీన వర్గాలవే అని అన్నారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు నామినేటెడ్ పదవులు కల్పిస్తే వారు రాజకీయంగా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది అన్నారు.బీసీ ల్లో సామాజికంగా వివక్షను ఎదుర్కొనే కులాలు చాలా ఉన్నాయి అని అన్నారు.సంచార జీవనం గడుపుతూ అత్యంత   దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు సామాజిక చైతన్యం పెంచేందుకు త్వరలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పసుల కాశీ యాదవ్,తోట యోగేందర్, నాగరాజు,పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు