నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌ ముందస్తులో భాగంగా పలువురు ఐకాస, తెరాస నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ సడక్‌ బంద్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో నియోజక
వర్గ ఐకాస కన్వీనర్‌ కిషోర్‌కుమార్‌, తెరాస నాయకులు వాసుదేవ్‌, రాజేష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.