నారాయణతో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, నేతలు మగ్దూం భవన్‌లో ఈరోజు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.