నారాయణ్‌ఖేడ్‌లో పంట పొలాల్లోకి వచ్చిన మొసలి

మెదక్‌: మంజీరా నది పరీవాహక ప్రాంతంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో అందులోని మొసళ్లు చల్లదనం కోసం పక్కనే ఉన్న పంటపొలాల్లోకి వస్తున్నాయి. వాటిని చూసిన రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రేగోడు మండలం సాయిపేట సమీపంలో ఓ పంట పొలంలోకి మొసలి వచ్చి తిష్టవేసింది. దీనిని చూసిన రైతుల భయాందోళనతో వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.