నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాక్‌లో అందాలపోటీ

1

బాగ్దాద్‌:ఇరాక్‌ చరిత్రలో నాలుగ దశాబ్దాల అనంతరం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదుల కాల్పులతో అట్టుడికే ఇరాక్‌ లో  43 ఏళ్ల తరువాత అందాల పోటీలు నిర్వహించారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో ఫైవ్‌ స్టార్‌ ¬టల్లో శనివారం నిర్వహించిన ఈ పోటీల్లో 20 ఏళ్ల పొడుగు కాళ్ల సొగసరి శ్యామా అబ్దుల్‌ రెహ్మాన్‌ మిస్‌ ఇరాక్‌ కిరీటాన్ని సగర్వంగా అందుకుంది. ఇరాక్‌ లోని కిర్‌ కుక్‌ నగరానికి చెందిన శ్యామా రెహ్మాన్‌ ఓవరాల్‌ ఓటింగ్‌ లో తొలి స్థానంలో నిలిచి కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మిగిలిన అందాల భామలు ‘మిస్‌ ఇరాక్‌’ కిరీటాన్ని ఆమె తలపై పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. మిస్‌ ఇరాక్‌ గా ఎంపికైన శ్యామా రెహ్మాన్‌.. మిస్‌ యూనివర్శ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. అందాల పోటీలు నిర్వహించడం పట్ల శ్యామా రెహ్మాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇరాక్‌ తిరిగి అభివృద్ది దిశగా పయనిస్తుందని ఆమె అన్నారు. ఇక్కడ పిల్లలకు విద్యా సౌకర్యాల కోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. ఇరాక్‌ లో చివరిసారి 1972 అందాల పోటీలు నిర్వహించారు. కాగా, ఆ తరువాత అందాల పోటీలపై ప్రభుత్వం నిషేధం విధించింది