నాలుగో టెస్టులో అరుదైన ఘటన:ఆటగాళ్లకు డ్రింక్స్‌ తెచ్చిన కోహ్లీ 

ధర్మశాల: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అకస్మాత్తుగా మైదానంలో కనిపించాడు. మ్యాచ్‌ మధ్య విరామంలో ఆటగాళ్లకు శీతల పానీయాలు తీసుకొచ్చాడు. జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కోహ్లీ ఈ టెస్టుకు దూరమవడంతో కాస్త నిరాశలో ఉన్న అభిమానులు మైదానంలో అతడిని చూడగానే ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ అరుస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు.

రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ నాలుగో టెస్టు ఆడలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో రహానేకు జట్టు బాధ్యతలను అప్పగించారు. కోహ్లీ స్థానంలో కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకున్నారు.